Gujarath : కుప్పకూలిన లిఫ్ట్.. ఏడుగురు కూలీలు మృతి..

Gujarath : కుప్పకూలిన లిఫ్ట్.. ఏడుగురు కూలీలు మృతి..
X
Gujarath : గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ప్రమాదవశాత్తు లిఫ్ట్ కూలింది

Gujarath : గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ప్రమాదవశాత్తు లిఫ్ట్ కూలింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది కూలీలు దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఉన్న ఎనిమిది మంది ఉన్నారని.. అందరూ అక్కడిక్కడే చనిపోయారని పోలీసులు తెలిపారు.

కూలీలను తీసుకెళ్తున్న లిఫ్ట్ ఏడో అంతస్తు నుంచి నేరుగా కిందికి పడిపోయిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. లిఫ్ట్ ప్రమాదంపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ప్రతిపక్ష పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు.

Tags

Next Story