క్షణికావేశంతో ప్రేమజంట ఆత్మహత్య!

క్షణికావేశంతో  ప్రేమజంట ఆత్మహత్య!
మనిషా తన ప్రేమ గురించి పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేక ఓ రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది.

క్షణికావేశంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం ఓ రెండు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్‌కు చెందిన రాకేష్, గోవిందుపల్లికి చెందిన మనిషా గత కొద్దిరోజులుగా ప్రేమించుకున్నారు. అయితే ఓ ఏడాది క్రితం రాకేష్ దుబాయ్‌ కి వెళ్ళాడు. ఈ క్రమంలో మనీషాకి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారు.

అయితే మనిషా తన ప్రేమ గురించి పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేక ఓ రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. దుబాయ్ లో ఉన్న రాకేష్.. ఈ విషయం తెలుసుకొని.. సెల్ఫీ వీడియో ద్వారా తల్లికి తన బాధను చెపుతూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియోలో మనీషా లేకుండా తాను బతకలేనంటూ నీ వద్దకే వస్తున్నానని అంటూ చెప్పుకొచ్చాడు. ప్రియుడు రాకేష్ సెల్ఫీ వీడియో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story