Hyd Love Murder : హైదరాబాద్ పరిధిలో దారుణం... లాడ్జిలో యువతి శవమై..!

X
By - /TV5 Digital Team |26 Oct 2021 2:23 PM IST
Hyd Love Murder : హైదరాబాద్ చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. ఓ లాడ్జిలో యువతి శవమై తేలింది.
Hyd Love Murder : హైదరాబాద్ చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. ఓ లాడ్జిలో యువతి శవమై తేలింది. ఒంగోలుకు చెందిన నాగచైతన్య, కోటిరెడ్డి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కులాలు వేరు కావడంతో పెళ్లికి వాళ్ల పెద్దలు నిరాకరించారు. అయితే.. చందానగర్‌లోని ఓ లాడ్జిలో నాగచైతన్య శవమై కనిపించింది. కోటిరెడ్డి ఒంగోలులోని ఓ హోస్పిటల్‌లో ప్రత్యక్షమయ్యాడు. అతని ఒంటినిండా గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలిని హత్య చేసి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న కారణంతో తాము చనిపోవాలనుకున్నామని కోటిరెడ్డి తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. నాగచైతన్య హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com