బ్రేకింగ్.. దివ్యాంగులైన ప్రేమ జంట ఆత్మహత్య

బ్రేకింగ్.. దివ్యాంగులైన ప్రేమ జంట ఆత్మహత్య
చనిపోయే ముందు యువతి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్పీ వీడియో తీసి తల్లికి పంపింది.

నల్గొండ జిల్లా అనుముల మండలం పాలెం గ్రామ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. దివ్యాంగులైన ఓ ప్రేమ జంట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.. మృతులను షేక్‌ మస్తాన్‌ వలి, అశ్వినిగా గుర్తించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి బైక్‌ పై సాగర్‌కు వచ్చి సరదగా గడిపిన ఆ ప్రేమ జంట తరువాత ఏమైందే ఏమో ఆత్మహత్యకు పాల్పడింది.. అయితే చనిపోయే ముందు అశ్విని‌ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్పీ వీడియో తీసి తల్లికి పంపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

Read MoreRead Less
Next Story