క్రైమ్

Jangaon: జనగామ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య..

Jangaon: బిక్యనాయక్ తండాలో బానోతు దీపిక, గుగులోతు రాజు అనే ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

Jangaon: జనగామ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య..
X

Jangaon: జనగామ జిల్లాలో తీవ్ర విషాదంచోటుచేసుకుంది. పాలకుర్తి మండలం బిక్యనాయక్ తండాలో బానోతు దీపిక, గుగులోతు రాజు అనే ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని పల్లెప్రకృతి వనంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అయితే గుగులోతు రాజే బలవంతంగా తన బిడ్డకు పురుగుల మందు తాగించి హత్యచేసి ఉంటాడని దీపిక తండ్రి ఆరోపిస్తున్నారు. మూడు నెలలక్రితం మైనర్ బాలిక గుగులోతు ప్రియాంక మృతికి కూడా రాజే కారణమని గ్రామంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో ఇద్దరు మృతిచెందడంతో అక్కడ విషాదచాయలు అలుముకున్నాయి.

Next Story

RELATED STORIES