Terrorist Harpreet Singh: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హర్‌ప్రీత్ సింగ్ అరెస్ట్..

Terrorist Harpreet Singh : మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హర్‌ప్రీత్ సింగ్‌ను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో లూథియానా కోర్టు భవనంలో జరిగిన బాంబు పేలుడులో హర్‌ప్రీత్‌సింగ్ ప్రధాన కుట్రదారుడిగా ఉన్నారు. ఈ పేలుడులో ఒకరు చనిపోగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కోర్టు బిల్డింగ్ పేలుడు ఘటనపై లూథియానా పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును ఎన్ఐఏ స్వీకరించింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ హర్ ప్రీత్‌సింగ్ ప్రధాన సూత్రదారుడికి నిర్దారించింది. అరెస్టయిన నిందితుడికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌తో పాటు పలు కేసుల్లో కూడా ప్రమేయం ఉందని ఎన్‌ఐఏ వెల్లడించింది. అప్పట్లో హర్‌ప్రీత్ సింగ్ ఆచూకీ చెప్పిన వారికి 10లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అతనిపై లుక్ అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com