Machilipatnam : బాలికపై ఇంజెక్షన్‌తో దాడి

Machilipatnam : బాలికపై ఇంజెక్షన్‌తో దాడి
X
ఏ ఇంజెక్షన్‌ చేశాడోనని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు; కిడ్నాప్‌ గ్యాంగ్‌ పై అనుమానాలు...

మచిలీపట్నం రాజుగారి సెంటర్‌లో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ఇంజెక్షన్‌తో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యాడు. ట్యూషన్‌ నుంచి వచ్చే సమయంలో బాలికపై దాడి చేయడంతో స్పృహ కోల్పోయింది. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఏ ఇంజెక్షన్‌ చేశాడోనని ఆందోళన చెందుతున్నారు. నగరంలో కిడ్నాప్‌ గ్యాంగ్‌ తిరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి కోసం సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నారు పోలీసులు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story