నేను మూడో కన్ను తెరిస్తే భస్మమే: పద్మజ

ఎదిగిన ఇద్దరు కూతుళ్లను నిష్కారణంగా తమ చేతులతోనే చంపుకున్నారు విద్యావంతులైన తల్లిదండ్రులు. మూఢభక్తితో బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న పద్మజ, పురుషోత్తమనాయుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. బార్యాభర్తలిద్దరూ స్కిజోఫ్రేనియా, మేనియా వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు రూయా ఆస్పత్రి మానసిక వైద్యులు వివరించారు.
మదనపల్లెలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజను భారీ బందోబస్తు నడుమ శుక్రవారం రుయాకు తీసుకొచ్చారు. వీరిని పరీక్షించిన వైద్యలు విశాఖ రుయా ఆస్పత్రికి రిఫెర్ చేశారు. మరోవైపు వీరి ఆర్థిక స్థితి గతులు బావుండడంతో ఎవరైనా వీరిపై కన్నేసి ఉండొచ్చన్న అనుమానాలతో హైకోర్ట్ అడ్వకేట్ రజనీ నిందితులను విచారించేందుకు సిద్ధమయ్యారు.
కాగా, పురుషోత్తం నాయుడుకు స్వయానా తమ్ముడైన దిలీప్ మాట్లాడుతూ.. అన్నకు, వదినకు, పెద్దమ్మాయి పద్మజకు దైవభక్తి ఎక్కువ అని చెప్పారు. వదిన, అలేఖ్య అధ్యాత్మిక భావనతో మానసికంగా అదో లోకంలో ఉండేవారని తెలిపారు.
ఇదిలా ఉంటే పద్మజ ట్రీట్‌మెంట్ చేసేందుకు వెళ్లిన వైద్యులతో తాను మూడో కన్ను తెరిస్తే భస్మమవుతారని వైద్య పరీక్షలకు వచ్చిన పద్మజ రుయా డాక్టర్లను తొలుత బెదిరించారు. దీంతో వైద్యులు ఆందోళన చెందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com