కాళికనని.. అలేఖ్య నాలుక కోసి తినేసిన పద్మజ!

కాళికనని.. అలేఖ్య నాలుక కోసి తినేసిన పద్మజ!
శుక్రవారం విచారణలో భాగంగా భర్త పురుషోత్తం నాయుడు నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.

మదనపల్లె జంట హత్యల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం విచారణలో భాగంగా భర్త పురుషోత్తం నాయుడు నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. కాళికగా భావిస్తున్న తన భార్య పద్మజ.. పెద్ద కుమార్తె అలేఖ్యను చంపిన తర్వాత ఆమె నాలుకను కోసి తినేసిందని చెప్పినట్లు సమాచారం. అయితే పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత దీనిపై మరింత స్పష్టం వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అలాగే పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య చెప్పేదని పురుషోత్తం వైద్యులకు తెలిపారు.

కాలేజీలో పాఠాలు చెప్పడం కాదని.. పాండవుల తరఫున అర్జునుడు ముందుండి నడిపిన పోరాటస్ఫూర్తిని కొనసాగించాలి అని అలేఖ్య తనకు చెప్పినట్టు పురుషోత్తం తెలిపారు. కలియుగం అంతమై.. సత్యయుగం వస్తుందని.. ఇందుకు కరోనా కూడా ఒక సంకేతమని చెప్పేదన్నారు. తన కూతురు చెప్పిన మాటలన్నీ నిజమేనని.. తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఈ విషయాలు ఉన్నాయని పురుషోత్తం వైద్యులకు చెప్పారు.

పురుషోత్తం, పద్మజ ఇద్దరూ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని.. అందుకే విశాఖలోని ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రానికి సిఫార్సు చేశామని తిరుపతిలోని రుయా మానసిక వైద్యనిపుణులు తెలిపారు. ఇద్దరినీ మదనపల్లె సబ్‌జైలు నుంచి శుక్రవారం ఉదయం తిరుపతి రుయా ఆస్పత్రిలోని మానసిక చికిత్స విభాగానికి తరలించారు. తన బిడ్డలు తిరిగి వస్తున్నారు.. ఇంటికి వెళ్లాలి.. జైలులో తోడుగా ఉన్న శివుడు, కృష్ణయ్య ఇక్కడ కనిపించడం లేదని పద్మజ తెలిపిందని వైద్యులు చెబుతున్నారు.

పద్మజ సన్నిహితులను మానసిక వైద్యులు విచారించగా ఆమె తండ్రి కూడా 20 ఏళ్లుగా మానసిక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. పద్మజ మేనమామ కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డారని వంశపారంపర్యంగా పద్మజకు.. ఆమె కూతురు అలేఖ్యకు ఇది సంక్రమించి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.

చెల్లి సాయిదివ్య చనిపోవాలని భావిస్తే అలేఖ్య ప్రోత్సహించిందని.. అయితే అది సరికాదని సర్దిచెప్పిన తల్లిదండ్రులూ చివరికి అదే మూఢవిశ్వాస మైకంలోకి వెళ్లిపోయారు. చివరకు ఘోరమైన హత్యలకు పాల్పడ్డారు. అలేఖ్య భోపాల్‌లో చదువుతున్నప్పుడు అక్కడ పలువురు ప్రబోధకుల ప్రసంగాలు, రచనలకు ఆకర్షితురాలయ్యారు. నిరంతరం వాటి అధ్యయనంలోనే మునిగి తేలుతూ చివరికి భ్రమల్లోకి వెళ్లిపోయారు. తనలో శివుడి ఉన్నాడని తల్లిదండ్రులనూ నమ్మించింది. గతంలో తాను ఓ కుక్కను చంపి, పునర్జన్మ ప్రసాదించానని నమ్మబలికినట్లు తెలిసింది.


Tags

Read MoreRead Less
Next Story