Madhya Pradesh: బీజేపీ మాజీ కౌన్సిలర్.. కుటుంబంతో సహా ఆత్మహత్య
Madhya Pradesh: బీజేపీ మాజీ కౌన్సిలర్‌తో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని విదిషాలో బీజేపీ మాజీ కౌన్సిలర్ తన ఇద్దరు కుమారులకు ముందు విషం ఇచ్చారు. అనంతరం తాను, తన భార్య విషం తాగి మరణించారు.
బీజేపీ మాజీ కార్పొరేటర్ సంజీవ్ మిశ్రా. కొడుకు 'మస్కులర్ డిస్ట్రోఫీ' అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఎంతమంది వైద్యులకు చూపించినా అతడి వ్యాధి నయం కాలేదు. కుమారుడి దుస్ధితిని చూసి భార్యాభర్తలిరువురూ తీవ్రంగా కలత చెందేవారు. దీంతో ఆత్మహత్యే శరణ్యం అని భావించారు.
ఇద్దరు కుమారులతో కలిసి విషం తాగాలని నిశ్చయించుకున్నారు. దీంతో చిన్నారులకు ముందు విషం ఇవ్వగా వారు దాన్ని తాగడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం దంపతులు ఇద్దరూ పాయిజన్ తీసుకున్నారు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు.
సమాచారం అందుకున్న బీజేపీ నేతలు ఆస్పత్రిని సందర్శించారు. తన కుమారుడి అనారోగ్యం కారణంగా సంజీవ్ మిశ్రా ఇబ్బంది పడ్డాడని, అందుకే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారని కలెక్టర్ ఉమాశంకర్ భార్గవ తెలిపారు. సంజీవ్ ఆత్మహత్యకు ముందు ఫేస్‌బుక్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com