Mahabubabad : కీచకులుగా మారిన ఉపాధ్యాయులు

సెయింట్ అగస్టీన్ హైస్కూల్‌లో విద్యార్థులే టార్గెట్‌గా ఉపాధ్యాయులు చెలరేగిపోతున్నారు. లైంగిక వేధింపులతో బాలికల్ని బలి చేస్తున్నారు. టీచర్లు తమను టార్చర్ చేస్తున్నారంటూ.. విద్యార్థినులు మూకుమ్మడిగా చెబుతున్నారు. పాఠాలు చెప్పి.. ప్రయోజకుల్ని చేయాల్సిన ఉపాధ్యాయులే.. ప్రేమ పాఠాలు.. సెక్స్ కబుర్లతో విద్యార్థులను చిర్రెత్తిస్తున్నారని అంటున్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్నారు. అక్కడ.. ఇక్కడ తాకుతూ.. స్టూడెంట్స్ పాలిట సైకోల్లా మారారని అంటున్నారు.
ఇన్నాళ్లూ ఓపిక పట్టిన విద్యార్థినులు కలిసికట్టుగా గళం విప్పారు. ముగ్గురు ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు దిగుతున్నట్లు వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చివరికి.. బస్సు డ్రైవర్, వాచ్‌మెన్ కూడా వేధిస్తున్నారని చెబుతున్నారు. స్కూళ్లో అసలేం జరుగుతోంది..? హిందీ టీచర్ ఖదీర్, మ్యాథ్స్ టీచర్ రవీందర్, పీఈటీ రాంబాబు వ్యవహార శైలి ఏంటి?.. బస్సు డ్రైవర్ బిచ్చు, వాచ్‌మెన్ శ్రీనుల పైశాచికత్వం ఏంటో.. పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించారు.
విద్యార్థినుల ఆరోపణలపై సెయింట్ అగస్టీన్ హైస్కూల్‌లో పోలీసులు విచారణ చేపట్టారు. అటు.. ఉపాధ్యాయుల ప్రవర్తనతో తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్కూల్‌లో ఆందోళన చేపట్టిన పేరెంట్స్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com