Maharastra: కన్నతండ్రి క్రూరత్వం.. మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని..

X
By - Prasanna |3 Nov 2021 4:11 PM IST
Maharastra: 38 రోజులు కూడా నిండని ఆ పసికందును రోడ్డుకేసి బాదాడు.
Maharastra: కన్న కూతురునే పొట్టనపెట్టుకున్నాడు ఓ కిరాతక తండ్రి. 38 రోజులు కూడా నిండని ఆ పసికందును రోడ్డుకేసి బాదాడు. తలపై బండరాయితో కొట్టి మరీ కిరాతకంగా చంపేశాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఈ అమానవీయ ఘటన జరిగింది. లైన్ గూడకు చెందిన బాపూరావు అనే వ్యక్తికి మహారాష్ట్రకు చెందిన మనుసబాయితో 2015లో పెళ్లయింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మూడోసారి కూడా ఆడసంతనమే కావడంతో కోపం పెంచుకున్నాడు బాపూరావు. తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. ఈక్రమంలోనే మంగళవారం రాత్రి.... ఇంట్లో నిద్రపోతున్న ఆ పసికందును బయటకు తీసుకొచ్చి చంపేశాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com