పోలీస్‌ కమిషనరేట్‌ ఉద్యోగి హత్య కేసులో కొత్త కోణం..

పోలీస్‌ కమిషనరేట్‌ ఉద్యోగి హత్య కేసులో కొత్త కోణం..

విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి మహేష్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మహేష్‌ హత్య వెనుక ఓ మహిళ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా మృతుడు మహేష్‌.. ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆ మహిళే మహేష్‌ హత్యకు పథక రచన చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. సుపారీ హత్యగా అంచనాకు వచ్చిన పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

నిన్న రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు వెళ్లిన సమయంలో మహేష్‌ హత్య జరిగింది. నున్న సమీపంలో మహేష్‌పై గుర్తు తెలియని వ్యక్తుక్తి కాల్పులు జరిపి పారిపోయారు. అయితే, అంతకు ముందు దుండగుడు అక్కడ రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.. ఓసారి స్కూటీపై వెళ్తూ మహేష్‌ను చూసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.. కాల్పుల ఘటన తర్వాత మహేష్‌తో వచ్చిన ఇద్దరు పారిపోయారు.

అటు తన కొడుకును హత్యచేసినవారిని కఠినంగా శిక్షించాలని మృతుడు మహేష్ తల్లి డిమాండ్‌ చేస్తున్నారు. క్రాంతి అనే యువతిని మహేష్‌ ప్రేమించినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు.. వీరి పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయయని.. ఆమె అంటున్నారు. తుపాకితో కాల్చి చంపారంటే ఈ హత్యవెనుక ఎవరో పెద్దవాళ్లు ఉండి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అటు ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటనాస్థలిని విజయవాడ సీపీ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు, పలు ప్రాంతాల్లో సీసీ పుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story