గర్బా ఈవెంట్ లో కూతురుకి వేధింపులు.. వాగ్వాదంలో తండ్రి మృతి

గర్బా ఈవెంట్ లో కూతురుకి వేధింపులు.. వాగ్వాదంలో తండ్రి మృతి
గర్బా కార్యక్రమంలో తన కుమార్తెను వేధించారని ఆరోపిస్తూ ఇద్దరు పొరుగువారితో గొడవపడి 52 ఏళ్ల వ్యక్తి మరణించడంతో విషాదం నెలకొంది.

గర్బా కార్యక్రమంలో తన కుమార్తెను వేధించారని ఆరోపిస్తూ ఇద్దరు పొరుగువారితో గొడవపడి 52 ఏళ్ల వ్యక్తి మరణించడంతో విషాదం నెలకొంది.

ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లోని సెక్టార్ 87లోని ప్రిన్సెస్ పార్క్ సొసైటీలో నివసిస్తున్న ప్రేమ్ మెహతా, అతని కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి అపార్ట్ మెంట్ ఆవరణలో జరిగిన గర్బా కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోని ఇద్దరు యువకులు వచ్చి దాండియా ఆడుతున్న మెహతా 25 ఏళ్ల కుమార్తె వద్దకు వచ్చి ఆమె కాంటాక్ట్ నంబర్ అడిగారు. తమతో కలిసి డ్యాన్స్ చేయమని ఒత్తిడి చేశారు. దాంతో ఆమె వెళ్లి తన తండ్రికి చెప్పింది.

తండ్రి వారి వద్దకు వచ్చి ఇది పద్దతి కాదని వారించారు. ఇద్దరు యువకులు వినిపించుకోపోగా మెహతాతో గొడవకు దిగారు. మెహతా భార్య, కుమారుడు కూడా యువకులను వారించారు. దాంతో మరింత రెచ్చిపోయిన యువకులు వారి మీదకు వచ్చి కాలర్ పట్టుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. అదే సమయంలో ఇద్దరు యువకులు మెహతాను నెట్టడంతో అతడు క్రిందపడి స్పృహ కోల్పోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

మెహతా కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు యువకులు తమ కుమార్తెను వేధించారని, 52 ఏళ్ల వ్యక్తిపై దాడి చేశారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story