Pakistan: పిల్లల కళ్ల ముందే భార్యను చంపిన భర్త.. ఆపై శరీరాన్ని ఉడకబెట్టి..

Pakistan: పిల్లల కళ్ల ముందే భార్యను చంపిన భర్త.. ఆపై శరీరాన్ని ఉడకబెట్టి..
Pakistan: హత్య అనంతరం అషిక్.. తన ముగ్గురు పిల్లలను తీసుకొని అక్కడ నుండి పారిపోయాడు.

Pakistan: మామూలుగా అక్రమ సంబంధాలు అనేవి భార్యభర్తల కాపురాన్ని కూల్చేస్తుంటాయి అని వినుంటాము. కానీ పాకిస్థాన్‌లో ఓ భర్త.. తన భార్య అక్రమ సంబంధానికి ఒప్పుకోవడం లేదని అతికిరాతకంగా హతమార్చాడు. అది కూడా తన ఆరుగురి పిల్లల కళ్ల ముందే ఈ దారుణం జరిగింది. పాకిస్థాన్ సింధ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

బజౌర్ ఏజెన్సీకి చెందిన అషిక్ ఓ ప్రైవేట్ స్కూల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య నగ్రీస్‌ను అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ గత కొంతకాలంగా వేధిస్తున్న అషిక్.. జులై 13న పూర్తిగా సహనం కోల్పోయాడు. అందుకే తన పిల్లల కళ్ల ముందే నగ్రీస్‌ను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం తను పనిచేస్తున్న స్కూల్‌లోనే ఆ శరీరాన్ని ఉడకబెట్టాడు.

హత్య అనంతరం అషిక్.. తన ముగ్గురు పిల్లలను తీసుకొని అక్కడ నుండి పారిపోయాడు. తన 15 ఏళ్ల కూతురు ఈ విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. వారు ఘటనాస్థలానికి చేరుకొని నగ్రీస్ శవాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న అషిక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదంతా పిల్లల కళ్ల ముందే జరగడంతో వారు షాక్‌లోకి వెళ్లారని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story