మహిళ ఫోటోలు మార్ఫిగ్ చేసి బ్లాక్ మెయిల్.. రూ.5 లక్షలు డిమాండ్ చేసిన వ్యక్తి అరెస్ట్

మహిళ ఫోటోలు మార్ఫిగ్ చేసి బ్లాక్ మెయిల్.. రూ.5 లక్షలు డిమాండ్ చేసిన వ్యక్తి అరెస్ట్
X

మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న 23 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారి శనివారం తెలిపారు.

అమృత్‌సర్ నివాసి మాధవ్ సింగ్ అనే వ్యక్తి ఒక మహిళ నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసి, డబ్బులు చెల్లించకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేస్తానని బెదిరించాడు.

వాయువ్య ఢిల్లీలో అతన్ని అరెస్టు చేసిన తర్వాత అతని వద్ద నుంచి అనేక మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో, మాధవ్ నేరం అంగీకరించాడు. "వినోదం" కోసం మహిళలను బ్లాక్ మెయిల్ చేశానని చెప్పాడు.

"సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి తనను సంప్రదించి మాటలు కలిపాడు.. మంచివాడిగా నమ్మించాడు. అనంతరం తన ఫోటోలను పంపించమని అడిగాడు. దాంతో ఆమె అతడికి తన ఫోటోలు పంపింది. ఆ తరువాత అతడు ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. అడిగినంత ఇవ్వక పోతే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దాంతో ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్‌వెస్ట్) భీషమ్ సింగ్ అన్నారు.

మాధవ్ సింగ్ తన గుర్తింపును దాచడానికి సోషల్ మీడియాలో నకిలీ ఐడీలను క్రియేట్ చేశాడు. అతని మొబైల్ నంబర్ లేదా చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను పంచుకోలేదు. దాంతో అతని జాడను గుర్తించడం కష్టతరం అయిందని ఆయన అన్నారు.

అయితే, డిజిటల్ ఫోరెన్సిక్స్, సాంకేతిక నిఘా మరియు మాన్యువల్ విశ్లేషణ ద్వారా, పోలీసులు అతని ఆన్‌లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేసి గుర్తించగలిగారని డిసిపి తెలిపారు.

నిరంతర ప్రయత్నాల తర్వాత, పోలీసులు అతన్ని విజయవంతంగా పట్టుకున్నారని, నిందితుడు ఉపయోగించిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు.

ఈ కేసు దర్యాప్తులో ఉంది, పోలీసులు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారని డిసిపి తెలిపారు.


Tags

Next Story