రేడియో టవర్‌ ఎక్కిన వ్యక్తి.. నష్టపరిహారం ఇవ్వట్లేదంటూ ఆందోళన

రేడియో టవర్‌ ఎక్కిన వ్యక్తి.. నష్టపరిహారం ఇవ్వట్లేదంటూ ఆందోళన
హైదరాబాద్‌ వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఓ వ్యక్తి రేడియో స్టేషన్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు

హైదరాబాద్‌ వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఓ వ్యక్తి రేడియో స్టేషన్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఎన్బీనగర్‌ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్‌లో గతంలో వరదలకు ఇద్దరు మృతి చెందినా.. ఇప్పటికీ నష్ట పరిహారం ఇవ్వలేదని.. దళిత బంధు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వడం లేదంటూ.. నర్సింగ్‌రావు చింతలకుంట రేడియో స్టేషన్ టవర్‌ ఎక్కాడు. ఇవన్నీ నెరవేర్చుతామని తనకు హామీ ఇచ్చేంత వరకు టవర్‌పైనే ఉంటానన్నాడు. హామీ ఇవ్వకపోతే దూకేస్తానంటూ బెదిరించాడు.

Tags

Read MoreRead Less
Next Story