మ్యాట్రిమోనీలో పరిచయం.. ఫోటోలు మార్ఫింగ్ చేసి..

మ్యాట్రిమోనీలో పరిచయం.. ఫోటోలు మార్ఫింగ్ చేసి..
మ్యాట్రిమోనీలో పరిచయం అయ్యాడు. చాటింగ్‌తో దగ్గరయ్యాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడి ఖాతాలో డబ్బులు పడగానే

మ్యాట్రిమోనీలో పరిచయం అయ్యాడు. చాటింగ్‌తో దగ్గరయ్యాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడి ఖాతాలో డబ్బులు పడగానే అడ్రస్ లేడు.. ఇలాంటి వార్తలు రోజూ వస్తున్నా కొందరు వాటిని నమ్మి మోసపోతూనే ఉన్నారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లో నకిలీ ఫ్రొఫైల్ పోస్ట్ చేశాడు ఓ వ్యక్తి. అది నిజమే అని నమ్మి మోసపోయింది నగరానికి చెందిన లిల్లీ బాలసాని అనే ప్రైవేట్ ఉద్యోగిని.

క్రిస్టియన్ మ్యాట్రిమోని డాట్‌కామ్ అనే వెబ్‌సైట్‌లో ఆంథోని సి వర్మ అనే వ్యక్తి ఫ్రొఫైల్ చూసి నచ్చడంతో ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీకి చెందిన లిల్లీ బాలసాని అతడితో మాటలు కలిపింది. చాటింగుల్ చేసింది. లండన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నానని, ఇండియా వచ్చి వివాహం చేసుకుని తిరిగి లండన్‌ వెళ్లి వైద్యుడిగా స్థిరపడతానని చెప్పాడు.

ఫోటోలు అతడివి కాకుండా వేరేవాళ్లవి పెట్టాడు. మాటల మధ్యలో ఇంటి అడ్రస్ చెబితే మంచి గిప్ట్ పంపిస్తానన్నాడు. నిజమే అని నమ్మి అతడికి అన్ని వివరాలు అందించింది. ఆ తరువాత ఆమెకు పార్శిల్ ఢిల్లీ విమానాశ్రయంలో ఉందని కస్టమ్స్ శాఖలో పన్ను కడితే రిలీజ్ చేస్తారని మెసేజ్ పెట్టాడు.

అక్కడే ఉన్న రహీం దెబ్రామా అనే వ్యక్తి సాయం చేస్తాడని చెప్పాడు. కొద్దిసేపటికే రహీం ఆమెకు ఫోన్ చేసి ఢిల్లీ విమానాశ్రయం నుంచి మాట్లాడుతున్నానన్నాడు. పార్శిల్ వచ్చింది పన్ను కట్టమని చెప్పేసరికి మొదటి విడతలో రూ. 68,500లు, రెండో సారి రూ.4,750లు పంపించింది. అంతటితో సరిపెట్టక మరో లక్షరూపాయలు పింపితే కానీ పార్శిల్ కస్టమ్స్ అధికారుల నుంచి బయటకు వస్తుందని చెప్పాడు.

దీంతో అనుమానం వచ్చిన ఆమె మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయం అయిన ఆంథోని ప్రొఫైల్ నకిలీదని తేలింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story