చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ శవం వద్ద పూజలు

చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ శవం వద్ద పూజలు
Jagtial: సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ..మూడనమ్మకాలు గ్రామాల నుంచి తొలిగి పోవటం లేదు.

Jagtial: సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ...మూడనమ్మకాలు గ్రామాల నుంచి తొలిగి పోవటం లేదు. మృతి చెందిన వ్యక్తిని తిరిగి బతికిస్తానంటూ శవం దగ్గర పూజలు... జగిత్యాల జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది. జగిత్యాల జిల్లా శివారు టీఆర్‌నగర్‌లో రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మంత్రాల వల్లే రమేష్ మృత్యువాతపడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తూ.. స్థానికంగా ఉండే పుల్లయ్యను చితకబాదారు. రమేష్‌ తనవల్లే మృతిచెందాడని మళ్లీ బతికిస్తానంటూ శవం దగ్గర పుల్లయ్య పూజలు చేయటం స్థానికంగా కలకలం రేపింది.

శవం దగ్గర పూజల విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. శవ పరీక్ష కోసం రమేష్ మృతదేహంను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు

Tags

Read MoreRead Less
Next Story