Crime News: ప్రియురాలి పెళ్లి మరొకరితో.. సహించని ప్రియుడు బహుమతిలో బాంబు పెట్టి..

Crime News: ప్రియురాలి పెళ్లి మరొకరితో.. సహించని ప్రియుడు బహుమతిలో బాంబు పెట్టి..
Crime News: ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితోనా అని పెళ్లి పీటల మీద కూర్చున్న ప్రియురాలిని చూసి కోపం కట్టలు తెంచుకుంది.

Crime News: ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితోనా అని పెళ్లి పీటల మీద కూర్చున్న ప్రియురాలిని చూసి కోపం కట్టలు తెంచుకుంది. హోమ్ థియేటర్‌ను కానుకగా ఇచ్చాడు. అదే వరుడి పాలిట శాపం అయింది. అందులో అమర్చిన బాంబు పేలి పెళ్లి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి కానుకగా అందుకున్న హోమ్ థియేటర్ మ్యూజిక్ సిస్టమ్ ప్లగ్ ఆన్ చేయగానే పేలిపోవడంతో కొత్తగా పెళ్లయిన వ్యక్తి, అతని సోదరుడు మరణించారు. పేలుడు ధాటికి మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హోమ్ థియేటర్‌లో పేలుడు పదార్థాలు అమర్చి వధువు మాజీ ప్రియుడు బహుమతిగా ఇచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో చోటుచేసుకుంది. పేలుడు ధాటికి హోమ్ థియేటర్ సిస్టమ్ ఉంచిన గది గోడలు, పైకప్పు కూలిపోయాయి. వరుడు 22 ఏళ్ల హేమేంద్ర మెరావి హోమ్ థియేటర్ సిస్టమ్‌ను ఎలక్ట్రిక్ బ్యాండ్‌కు కనెక్ట్ చేసిస్విచ్ ఆన్ చేశాడు. దాంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. వరుడు మెరావి అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి తీవ్రగాయాలపాలైన అతని సోదరుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడిని సర్జుగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో, నిందితుడు తన మాజీ ప్రియురాలిని వివాహం చేసుకున్నందుకు మెరావి పై కోపంగా ఉన్నానని అంగీకరించాడు. అందుకే బాంబులు అమర్చిన హోమ్ థియేటర్ సిస్టమ్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చానని తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story