Crime News: ప్రియురాలిని కాల్చి చంపాడు.. పారిపోతూ యాక్సిడెంట్ లో అతడు కూడా..

Crime News: తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడడం అంటే ఇదేనేమో. తాను ప్రేమిస్తున్న ప్రియురాలు తనను ప్రేమించట్లేదని ఆగ్రహంతో విచక్షణ కోల్పోయాడు. అందరూ చూస్తుండగానే ఆమెను కాల్చి చంపి పారిపోతున్నాడు.. అంతలోనే అటుగా వస్తున్న సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) వాహనం ఢీకొని మరణించాడు..
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని బోయిసర్‌లో రద్దీగా ఉండే రహదారిపై బుధవారం ఒక వ్యక్తి తన ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపాడు.
కృష్ణ యాదవ్ అనే వ్యక్తి తన స్నేహితురాలు నేహా మహతోను కాల్చి చంపిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నించాడు. అంతలోనే వాహనం ఢీకొనడంతో స్పృహ కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది.. కృష్ణ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు.
బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు, కృష్ణ యాదవ్ మరియు నేహా మహతో బోయిసర్‌లోని టిమా హాస్పిటల్ దగ్గర వాగ్వాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కోపంతో ఉన్న కృష్ణ యాదవ్ పిస్టల్‌ని తీసి, ప్రజలు చూస్తుండగానే నేహాను అతి సమీపం నుంచి కాల్చిచంపాడు.
నేహా మహతో రోడ్డుపై కుప్పకూలడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, అర కిలోమీటరు ప్రయాణించిన తర్వాత అటుగా వెళుతున్న (సిఐఎస్ఎఫ్) వాహనం అతడిని ఢీకొంది.
ఈ ప్రమాదంలో కృష్ణ యాదవ్ తలకు తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విచారణ అధికారులు యాదవ్ నుంచి హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేహా హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com