ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తించి కొడుకు మరణానికి కారణమైన తండ్రి.. అతడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
న్యూజెర్సీలో తన 6 ఏళ్ల కుమారుడిని చంపినందుకు గాను ఓ తండ్రికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. క్రిస్టోఫర్ గ్రెగర్ తన కొడుకు కోరీ మిక్కియోలోను ట్రెడ్‌మిల్ వర్కౌట్‌లు చేయమని బలవంతం చేసి, బాలుడి మరణానికి కారణమయ్యాడు. జ్యూరీ సాక్ష్యాలను విన్న తర్వాత క్రిస్టోఫర్ నరహత్యకు పాల్పడినట్లు తేలింది. తండ్రి వేధింపుల సమయంలో తగిలిన గాయాల వల్లే చిన్నారి చనిపోయాడని ప్రాసిక్యూటర్ ఆరోపించారు.
ఏప్రిల్ 2021లో బాలుడు మరణించిన దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత నాలుగు వారాల విచారణ చేపట్టారు. అనంతరం ఈ శిక్ష విధించబడింది.
కోర్ట్‌రూమ్‌లో చూపబడిన ఒక వీడియో గ్రెగర్ ట్రెడ్‌మిల్‌పై వేగాన్ని పెంచుతున్నట్లు చూపించింది, దీని వలన అతని కొడుకు ఆరుసార్లు ఎగిరి పడిపోయాడు. బాలుడు చాలా లావుగా ఉన్నాడని గ్రెగర్ ఆరోపించాడు. ఏప్రిల్ 2న, నిద్ర లేస్తూనే కడుపులో తిప్పుతుందని తండ్రికి తెలిపాడు. తండ్రి అతని మాటలను తప్పుపట్టాడు. బాలుడు చనిపోయేముందు అతని శరీరం నిస్సత్తువగా మారిపోయింది. ఆస్పత్రికి తీసుకు వెళ్లినా లాభం లేకపోయింది.
గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి, CT స్కాన్ సమయంలో కోరీ మూర్ఛకు గురయ్యాడు, వైద్య సిబ్బంది అత్యవసర చర్యలు తీసుకోవలసి వచ్చింది. వారు ప్రయత్నించినప్పటికీ, సాయంత్రం 5 గంటలలోపు చిన్నారి చనిపోయిందని నిర్ధారించారు.
అతని శిక్షకు ముందు న్యాయమూర్తికి ఒక ప్రకటనలో, క్రిస్టోఫర్ గ్రెగర్ తన కొడుకు మరణానికి బాధ్యతను నిరాకరించాడు. "కోరీ మరణానికి కారణం నేను కాదు అని గ్రెగర్ చెప్పాడు . “నేను నా కొడుకును బాధపెట్టలేదు. నేను అతనిని ప్రేమిస్తున్నాను, నేను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. అతన్ని త్వరగా ఆసుపత్రికి తీసుకురానందుకు చింతిస్తున్నాను. అతను ఎంత అనారోగ్యంతో ఉన్నాడో నాకు తెలియదు. అతను అలసిపోయాడని నేను అనుకున్నాను.
కోరీ తల్లి, బ్రెన్నా మికియోలో గ్రెగర్‌ను "రాక్షసుడు" అని పిలిచింది, "నువ్వు అలా చేయలేదని అంటే నేను ఒప్పునేంత వెర్రిదానను కాను అని తెలిపింది. "నేను నిన్ను ద్వేషిస్తున్నాను, నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని జీవచ్ఛవంలా పడి ఉన్న కొడుకుని చూసి విలపిస్తూ చెప్పింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com