Delhi: భోజనం పెట్టలేదని భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత..

Delhi: చిన్న చిన్న గొడవలు హత్యకు దారితీస్తున్న సంఘటనలు ఈమధ్య కాలంలో మరీ ఎక్కువయిపోయాయి. ముఖ్యంగా భార్యాభర్తల గొడవల వల్లే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో అలాంటి సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని దుస్థితిలో భార్యను హత్య చేశాడు ఓ వ్యక్తి.
ఢిల్లీలోని సుల్తానాపూర్‌కు చెందిన వినోద్ కుమార్ దూబేకు 2008లో సోనాలితో వివాహం జరిగింది. ఇటీవల వారిద్దరూ కలిసి ఇంట్లో మద్యం సేవించారు. ఆ తర్వాత తనకు భోజనం పెట్టమని సోనాలికి చెప్పాడు వినోద్. దీనికి సోనాలి అంగీకరించలేదు. పైగా వాగ్వాదం పెద్దగా అవ్వడంతో తనపై చేయి కూడా చేసుకుంది. దీంతో వినోద్ కోపం కట్టలు తెంచుకుంది.
సోనాలిని కొట్టడంతో పాటు దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం మద్యం మత్తులో శవం పక్కనే నిద్రపోయాడు. ఉదయం లేచిన తర్వాత సోనాలి చనిపోయిన విషయం అర్థం చేసుకున్న వినోద్ ఇంట్లోని దాదాపు రూ.40,000 డబ్బుతో పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగానే కొన్ని గంటల్లోనే వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com