భార్య అక్రమ సంబంధం.. ఆగ్రహించిన భర్త ఆమెను నగ్నంగా వీధుల్లో..

భార్య అక్రమ సంబంధం.. ఆగ్రహించిన భర్త ఆమెను నగ్నంగా వీధుల్లో..

ప్రతీకాత్మక చిత్రం

Marital Affair: పెళ్లికి ముందు మరొకరితో ప్రేమాయణం సాగించి పెళ్లైన తరువాత కూడా అతడి తలపుల్లోనే ఉంటూ అతడితో సంబంధాన్ని కొనసాగిస్తుందని భార్యపై ఆగ్రహంతో ఊడిపోయాడు భర్త.

Marital Affair: పెళ్లికి ముందు మరొకరితో ప్రేమాయణం సాగించి పెళ్లైన తరువాత కూడా అతడి తలపుల్లోనే ఉంటూ అతడితో సంబంధాన్ని కొనసాగిస్తుందని భార్యపై ఆగ్రహంతో ఊడిపోయాడు భర్త. ఆమె చేసిన చర్యకు తగిన ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. నగ్నంగా ఊరేగించి బుద్ది చెప్పాలనుకున్నాడు. గ్రామస్తులు కూడా అందుకు వంత పాడారు. అతడి పైశాచిక చర్యకు పోలీసులు అడ్డుకట్ట వేసి కటకటాల్లో పడేశారు.

గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో పోలీసులు బుధవారం తన భార్యను నగ్నంగా పరేడ్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. భర్తకు సహాయం చేసినందుకు కనీసం 18 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జూలై 6 న దాహోద్ జిల్లాలోని గిరిజన ఆధిపత్య ధన్పూర్ తాలూకాలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిన తరువాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

వైరల్ అయిన ఈ వీడియోలో మహిళ భర్త, ఇతర గ్రామస్తులతో పాటు అతని బంధువులు, తన భార్యను బట్టలు లేకుండా బహిరంగంగా లాగడంతో పాటు, కొట్టడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. అంతటితో ఆగక నగ్నంగా ఉన్న ఆమె భుజాలపై తన భర్తను మోసుకెళ్తూ నడవమని ఆజ్ఞాపించారు.

"బాధితురాలు ఇటీవల ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది. ఆమె భర్త మరియు ఇతర గ్రామస్తులు వీరిద్దరిని గుర్తించి గ్రామానికి తీసుకువచ్చారు. జూలై 6 న ఆమెకు శిక్షగా వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. వీడియో వైరల్ అయి పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే బాధితురాలి భర్తతో సహా నిందితులందరినీ అరెస్ట్ చేసారు. ఐపిసి కింద ఒక మహిళపై అల్లర్లు, దాడి, క్రిమినల్ బెదిరింపులు, అవమానించడం వంటి ఆరోపణలపై నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story