కేంద్ర మంత్రి నివాసంలో మృతదేహం.. ఎంపీ కొడుకుపైనే అనుమానం

X
By - Prasanna |1 Sept 2023 10:37 AM IST
కేంద్ర మంత్రి ఇంటిలో ఓ వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. సంఘటన స్థలం నుండి మంత్రి కొడుకుకు సంబంధించిన పిస్టల్ లభ్యమైంది.
కేంద్ర మంత్రి ఇంటిలో ఓ వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. సంఘటన స్థలం నుండి మంత్రి కొడుకుకు సంబంధించిన పిస్టల్ లభ్యమైంది. లక్నోలోని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ఇంటి వద్ద ఓ యువకుడు శవమై కనిపించాడు. ఆ వ్యక్తి మంత్రి కుమారుడికి స్నేహితుడు అని సమాచారం.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో శుక్రవారం కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ నివాసం వద్ద ఓ యువకుడు కాల్చి చంపబడ్డాడు. ఘటనా స్థలం నుంచి మంత్రి కుమారుడి పేరుతో లైసెన్స్‌డ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బాధితుడు వికాస్ శ్రీవాస్తవ, కౌశల్ కిషోర్ కొడుకు స్నేహితుడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని అనుమానం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com