కోరి చేసుకున్నందుకు కొండపై నుంచి తోసి..

కోరి చేసుకున్నందుకు కొండపై నుంచి తోసి..
కట్టుకున్న భార్యను కొండ మీద నుంచి తోసేసి ఆమె మరణానికి కారణమయ్యాడో ప్రబుద్ధుడు.

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో భార్యను కొండపై నుంచి నెట్టివేసినందుకు 24 ఏళ్ల సేల్స్‌మెన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో నివసిస్తున్న ఓ వ్యక్తి తనను వివాహం చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అతడితో అన్నీ పంచుకుంది. కోరిక తీరాక కాదు పొమ్మన్నాడు. అతడు తనను అత్యాచారం చేశాడని 29 ఏళ్ల మహిళ ఢిల్లీ పోలీసులు గత ఏడాది జూన్‌లో ఫిర్యాదు చేశారు.

మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ రాయ్‌ను గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు. కొంతకాలానికి ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది. తనను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పడంతో అతన్ని అక్టోబర్‌లో ఢిల్లీ తీహార్ జైలు నుండి విడుదల చేశారు. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకున్నారు.

కానీ ఆమె కోరుకున్నట్లు వారి జీవితం అన్యోన్యంగా సాగలేదు. భార్యను శారీరకంగా వేధించడం, తరచు గొడవ పడుతుండేవాడు. దీంతో ఆమె.. అతడి వేధింపులు తాళలేక తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజులు గడిచిన తరువాత భార్యను తిరిగి రమ్మని, బాగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆమెని ఒప్పించాడు.

చివరికి జూన్ 11 న అతను ఆమెను ఉత్తరాఖండ్ లోని ఉధామ్ సింగ్ నగర్ జిల్లాలోని తన గ్రామానికి తీసుకెళ్లాడు. దీని తరువాత, కూతురు బబిత ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆమె కుటుంబం ఆందోళన చెందింది. జరగరానిది ఏదో జరిగి ఉంటుంది అని వారి మనసు కీడు శంకించింది. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఢిల్లీ పోలీసులు ఆమె భర్తను గుర్తించి అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో అతడు తన భార్యతో గొడవపడి తర్వాత ఆమెను నైనిటాల్ వద్దకు తీసుకెళ్ళి ఒక కొండపై నుండి నెట్టివేసినట్లు ఒప్పుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story