Banjara Hills Drugs Case: బంజారాహిల్స్‌ డ్రగ్స్ కేసు FIRలో సంచలన విషయాలు.. అతడిదే కీ రోల్..

Banjara Hills Drugs Case: బంజారాహిల్స్‌ డ్రగ్స్ కేసు FIRలో సంచలన విషయాలు.. అతడిదే కీ రోల్..
Banjara Hills Drugs Case: ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో.. డ్రగ్స్ కేసుకు సంబంధించిన FIRలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు.

Banjara Hills Drugs Case: బంజారాహిల్స్‌ ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో.. డ్రగ్స్ కేసుకు సంబంధించిన FIRలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. నిందితులు ఇద్దరిపైన NDPS యాక్ట్‌ -1985 కింద కేసులు నమోదు చేశారు. ఈ డ్రగ్స్‌ కేసులో పబ్‌లో మేనేజర్‌ అనిల్‌ కుమార్‌ కీరోల్‌ ప్లే చేస్తున్నట్టు గుర్తించి అతని స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. ఐతే.. విచారణకు అతను సహకరించని నేపథ్యంలో.. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారు అనే విషయాలు బయటకు రాలేదు.

దాడులకు వెళ్లిన సమయంలో మేనేజర్ అనిల్‌ దగ్గర ఉన్న ట్రేలో అనుమానాస్పద ప్యాకెట్లు గుర్తించి వాటిని సీజ్‌ చేసినట్టు FIRలో పేర్కొన్నారు. స్ట్రాలు పెట్టే ట్రేలో అనుమానాస్పద ప్యాకెట్లు సీజ్ చేశామని అవి కొకైన్‌ ప్యాకెట్లు అని పేర్కొన్నారు. 5 డ్రగ్స్‌ ప్యాకెట్లలో మొత్తం 4.64 గ్రాముల కొకైన్ ఉన్నట్టు చెప్తూ అదంతా సీజ్ చేసి కోర్టుకు సమర్పిస్తున్నారు‌.

ప్రధాన నిందితుడైన అనిల్‌ ఫోన్‌తోపాటు ఐపాడ్‌ సీజ్‌ చేశారు. వాటిల్లోనే 'పామ్‌'యాప్‌కి సంబంధించిన కీలక సమాచారం ఉందని భావిస్తున్నారు. అటు, పార్టీలో డ్రగ్స్ ఆధారాల్ని గుర్తించేందుకు కాల్చిపడేసిన 216 సిగరెట్‌ బట్స్‌ను.. కొన్ని టిష్యూలను, టూత్‌పిక్స్‌ లాంటి మరికొన్నింటిని సీజ్‌ చేశారు. వాటిని టెస్టులకు పంపబోతున్నారు. తద్వారా గంజాయి లాంటి వాటితో సిగరెట్లు కాల్చారా, ఇంకా ఏమైనా కొత్త డ్రగ్స్ వాడారా అనేది తేల్చబోతున్నారు.

అటు, ఈ డ్రగ్స్‌తో తనకు సంబంధం లేదని అభిషేక్‌ ఉప్పల పోలీసులకు చెప్తున్నట్టు సమాచారం. అటు, అభిషేక్‌ ఐఫోన్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. ఆ ఆధారాలన్నీ కోర్టు సమర్పించనున్నారు. కీలక నిందితుడు అనిల్‌ నోరు విప్పకపోవడంతో విచారణకు ఆటంకాలు కలుగుతున్నట్టు తెలుస్తోంది. అనిల్‌, అభిషేక్‌ ఇద్దరి ఫోన్లు పరిశీలిస్తే కీలకమైన డేటా దొరికే అవకాశం కనిపిస్తోంది.

అటు, ఈ డ్రగ్స్ కేసులో తెరపైకి పబ్‌ మాజీ పార్ట్‌నర్‌ కిరణ్‌ రాజ్ పేరు కూడా వచ్చింది. అనిల్‌కి డ్రగ్స్‌ ఎవరి ద్వారా అందాయి..? డ్రగ్స్ కేసులో ఈవెంట్ మేనేజర్ కునాల్‌, డీజే శశిధర్‌రావుల పాత్ర ఎంత..? అనేది తేల్చేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. పరారీలో ఉన్న అర్జున్‌ వీరమాచినేని కోసం కూడా గాలిస్తున్నారు. పుడింగ్ అండ్‌ మింక్‌- పామ్‌ యాప్‌లో సభ్యులుగా ఉన్న 250 మంది ఎవరు..?

OTP చెప్తే వాళ్లకు డ్రగ్స్ సరఫరా చేసేంత నెట్‌వర్క్ ఎలా డెవలప్‌ చేశారనే మిస్టరీ కూడా ఛేదించేందుకు సిద్ధమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో యాప్‌ నిర్వహణ కానీ, వాట్సప్ గ్రూప్‌లకు అడ్మిన్‌గా ఉండడం కానీ అంతా అనిల్‌ కేంద్రంగానే జరిగినట్టు తెలుస్తోంది. వీకెండ్‌లో ఈ ఫుడింగ్‌ పబ్‌ కౌంటర్‌ 25 లక్షలు దాటే ఉంటుందని కూడా సమాచారం. పోలీసులు ఈ కేసు విచారణ ముమ్మరం చేసే కొద్దీ షాకింగ్‌ విషయాలు మరిన్ని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story