Mancherial: తప్పతాగి ఇల్లు మరిచాడు; దొంగ అనుకుని కుళ్లబొడిచారు
Mancherial

Mancherial: తప్పతాగి ఇల్లు మరిచాడు; దొంగ అనుకుని కుళ్లబొడిచారు
మద్యం మత్తు ఎంతటి దారణానికైనా దారితీస్తుంది అనడానికి మంచీర్యాలలో చోటుచేసుకున్న ఘటన నిరూపిస్తోంది. తప్పతాగి అర్థరాత్రి తప్పుడు ఇంటిలోకి వెళ్లిన వ్యక్తిపై ఇంటి యజమాని దొంగ అని భ్రమపడి దాడి చేయడంతో, తాగిన మైకంలోనే సదరు వ్యక్తి మరణించాడు.
దేవ్ పూర్ గ్రామంలోని కాశీపేట మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 35ఏళ్ల మురళి పూటుగా తాగి తన ఇల్లు అని భ్రమపడి భూమయ్య ఇంట్లోకి జొరబడ్డాడు. అయితే మురళిని దొంగగా భావించిన భూమయ్య కర్రతో అతడిపై దాడి చేసి గట్టిగా కేకలు వేశాడు. భూమయ్య అరుపులకు విషయం తెలుసుకున్న గ్రామస్థులు మరళిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగానే పరిస్థితి వకటించి మురళి ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇతర వివరాలు తెలియజేశారు.
జగిత్యాల జిల్లాలోని తండ్రి అంత్యక్రియలకు హాజరైన మురళి దేవ్ పూర్ లోని తన ఇంటికి వెళ్ల క్రమంలో పొరబడి భూమయ్య ఇంట్లోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే అతడు పొరబడి ఉంటాడని భావిస్తున్నారు. ఈ క్రమంలో భూమయ్య పొడువాటి కర్రతో మురళిపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com