Crime News: భర్త అక్రమ సంబంధం.. ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి ఉరివేసుకున్న భార్య

Crime News: భర్త అక్రమ సంబంధం.. ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి ఉరివేసుకున్న భార్య
Crime News: అభం శుభం తెలియని ఆ చిన్నారులకు అమ్మానాన్న ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు.

Crime News: అభం శుభం తెలియని ఆ చిన్నారులకు అమ్మానాన్న ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు. భర్త మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసి అతడిని నిలదీసింది భార్య. అయినా అతడు తన ప్రవర్తన మార్చుకోలేదు. అవమానంగా భావించింది. అన్యాయంగా తన ప్రాణాలను బలి తీసుకుంది.ముక్కుపచ్చలారని చిన్నారులకు విషం ఇచ్చి చంపేసింది. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రం మాండ్య జిల్లా మదుర్ పట్టణంలో చోటు చేసుకుంది. హోలే బీడీ గ్రామంలో అఖిల్ అహ్మద్, ఉస్నా కౌసర్ దంపతులు నివసిస్తున్నారు. అకీల్ కార్ మెకానిక్‌గా పని చేస్తుండగా, ఉస్నా సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది.


వీరికి 7 ఏళ్ల హారిస్ అనే కుమారుడు, 4 ఏళ్ల అలిస్సా, 2 ఏళ్ల ఫాతిమా అనే కుమారుడు ఉన్నారు. ముగ్గురు పిల్లలున్నా భర్త అక్రమసంబంధం పెట్టుకున్నాడు. అది తెలిసి ఉస్నా భర్తని నిలదీసింది. ఈ క్రమంలో గత రాత్రి ఉస్నా ఆహారంలో విషం కలిపి పిల్లలకు తినిపించింది. విషం కలిపిన ఆహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందారు. తరువాత ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రాన్ని కలచివేసింది.


తన భర్త అకీల్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకున్న ఉజ్నా కౌసర్‌.. ఆ విషయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, గొడవలు జరిగేవని చెబుతున్నారు కుటుంబసభ్యులు. దీంతో మనస్తాపానికి గురైన ఉస్నా ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసుల తొలి దశ విచారణలో తేలింది. అనంతరం మడూర్ టౌన్ పోలీసులు అకీల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story