MANGLI: నాకు పాటలు పాడడమే తెలుసు.. మోసం చేయడం తెలీదు

మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో సింగర్ మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు తనను డబ్బు డిమాండ్ చేశారని డబ్బు ఇవ్వనందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని, బిగ్ బాస్ కు వెళ్లేందుకు ఫేమస్ కావాలని చూస్తున్నారని ఆరోపించారు. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10కోట్ల మేర మోసం చేసినట్లు మంగ్లీ, ఆమె సోదరుడితో మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశాకు. తన పేరుతో ఎవరెవరో డబ్బులు వసూలు చేస్తున్నారంటే అవన్నీ తనకు తెలియడానికి నేనైమైనా దేవతనా అని ప్రశ్నించారు. నేను మామూలు మనిషినే అన్నారు. తనకు విషయం తెలియగానే బాధితులకు న్యాయం చేయమని పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తనకు పాటలు పాడడం మాత్రమే తెలుసని తన ప్రపంచం అదేనని చెప్పారు. తనకు డబ్బు కాదు వ్యక్తిత్వం ముఖ్యం అన్నారు. ఎవరినో చూపిస్తూ తన తమ్ముడు అని ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంతో తన పాత్ర లేదని ఒక వేళ ఉందని తేలితే అందుకు నేను దేనికైనా సిద్ధం, కానీ ఈ కేసులో నా ప్రమేయం లేదని తేలితే సుబ్బారావును ఏం చేస్తారని మీడియాను ప్రశ్నించారు. మైక్రో ఫైనాన్స్ బాధితుల తరపున పోరాడతానన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగ్లీ కంటతడిపెట్టుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
