Pushkar Shrotri : నటుడి ఇంట్లో దొంగతనం..
![Pushkar Shrotri : నటుడి ఇంట్లో దొంగతనం.. Pushkar Shrotri : నటుడి ఇంట్లో దొంగతనం..](https://www.tv5news.in/h-upload/2023/10/29/1102765-burglary-at-actor-pushkar-shrotri-house-gold-and-cash-stolen.webp)
ప్రముఖ మరాఠీ నటుడు పుష్కర్ ష్రోత్రి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న పనిమనిషి ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఆ నటుడు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కొన్ని నెలల నుంచి ఇంట్లో పనులు చేస్తున్న ఒక ఆమె లక్షలు విలువ చేసే డబ్బు, బంగారం తీసుకుని జంప్ అయిపోయింది. ప్రస్తుతం ఈ విషయమై సదరు నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె పనిమనిషి కాదు.దొంగతనంలో ఎలా ముదిరిపోయిందనేది కూడా సదరు నటుడు బయటపెట్టాడు.
పుష్కర్ ష్రోత్రి ఇంట్లో అక్టోబర్ 22న దొంగతనం జరిగినట్లు గుర్తించారు. రూ.1.20 లక్షలు డబ్బు, రూ.60 వేల ఫారిన్ కరెన్సీ కనిపించకుండా పోయినట్లు పుష్కర్ ష్రోత్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే ఈ దొంగతనం చేసింది ఆయన ఇంట్లో పనిచేసే పనిమనిషి ఉష చేసినట్లు తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె దొంగిలించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసింది. ఇక్కడే మరో ట్విస్ట్ ఎదురైంది.
ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అంటే అక్టోబరు 24న బంగారం విషయంలోనూ పుష్కర్ దంపతులకు ఎందుకో అనుమానమొచ్చింది. అక్టోబర్ 24 న పుష్కర్ ష్రోత్రి దంపతులకు ఏదో అనుమానం వచ్చి బీరువాలో ఉన్న బంగారాన్ని పరిశీలించారు. అది నకిలీది అని తేలడంతో షాకయ్యారు. పనిమనిషి ఉషనే రూ.10 లక్షల విలువైన బంగారంతో ఉడాయించినట్లు తేలింది. దీంతో పుష్కర్ మళ్లీ అక్టోబర్ 26 న పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పుడు కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com