కొన్ని గంటల్లో పెళ్లి.. కొడుకును చంపిన తండ్రి

కొన్ని గంటల్లో పెళ్లి.. కొడుకును చంపిన తండ్రి
నాన్నెందుకు అంత క్రూరంగా మారిపోయాడు. కన్న కొడుకు పెళ్లి కొడుకు అవుతున్న వేళ హత్య చేసి అతడి జీవితం ముగించేశాడు.

నాన్నెందుకు అంత క్రూరంగా మారిపోయాడు. కన్న కొడుకు పెళ్లి కొడుకు అవుతున్న వేళ హత్య చేసి అతడి జీవితం ముగించేశాడు. తనలో కొడుకుపై రగులుతున్న కోపాన్ని చల్లార్చుకున్నాడు చెట్టంత ఎదిగిన కొడుకును హత్య చేసి.

కొడుకు గౌరవ్ తనను రోజూ దూషించేవాడన్న కోపంతో రంగలాల్ ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బుధవారం నాడు తన వివాహానికి కొన్ని గంటల ముందు జిమ్ యజమానిన అయిన గౌరవ్ ని కత్తితో పొడిచి చంపిన తర్వాత సంతోషకరమైన వేడుక కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గౌరవ్ సింఘాల్ (29) అనే వ్యక్తిని అతని తండ్రి రంగలాల్ హత్య చేశాడని, అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జిమ్ ఫిట్ బాక్స్ నడుపుతున్న గౌరవ్, దేవ్లీ ఎక్స్‌టెన్షన్‌లోని తన ఇంటిలో ముఖం మరియు ఛాతీపై 15 సార్లు కత్తిపోట్లకు గురయ్యాడు. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడని వారు తెలిపారు. పెళ్లి చేసుకోబోయే కొన్ని గంటల ముందు ఈ హత్య జరిగిందని, ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని పోలీసులు తెలిపారు.

అతిధులు అతని వివాహ ఊరేగింపు కోసం ఆ ప్రాంతంలో మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేశారు. అయితే గౌరవ్ వేడుకల నుంచి హఠాత్తుగా మాయమయ్యాడు. కుటుంబసభ్యులు, అతిథులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. సమీపంలోని పార్క్‌లో అతడు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించారు. సంతోషకరమైన సందర్భం దు:ఖసాగరంగా మారింది.

రాజు పార్క్ వద్ద రక్తపు మడుగులో కనిపించాడు. సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే గౌరవ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని తండ్రి అప్పటికే అదృశ్యమయ్యాడు. కానీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సాయంత్రానికి అతడిని పట్టుకుని అరెస్టు చేశారు.

తండ్రే హంతకుడని, కొడుకుని అతడే చంపేశాడని తెలిసి బంధువులు విస్మయానికి గురయ్యారు. ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా చంపేంత పగలు ఉండకూడదని వచ్చిన అతిధులంతా మాట్లాడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story