Bengalore: ప్రేమ..పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య..

Bengalore: ప్రేమ..పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య..
Bengalore: గొడవలు ఏవైనా చావే పరిష్కారం అనుకుంటున్నారు. నిండు జీవితాలకు ముగింపు పలుకుతున్నారు.

Bengalore: గొడవలు ఏవైనా చావే పరిష్కారం అనుకుంటున్నారు. నిండు జీవితాలకు ముగింపు పలుకుతున్నారు.. పెళ్లై నాలుగు నెలలు కూడా కాలేదు.. ఆత్మహత్య చేసుకుంది నవ వధువు. ఇంజనీర్ చదివిన మృతురాలు చిక్కమగళూరుకు చెందిన అంజుగా గుర్తించారు. నాలుగు నెలల క్రితం అంజన్‌ కనియార్‌తో ఆమెకు వివాహమైంది. శనివారం సుబ్రహ్మణ్యనగర్‌లోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయిన ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అంజు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అంజన్ కణియార్ ని ప్రేమించి పెద్ధలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అంజన్ ది హాసన్ కాగా, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం సాయింత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అంజు బెడ్ రూమ్ లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఆఫీసు నుంచి వచ్చి చూసేసరికి అప్పటికే ఆమె ఊపిరి ఆగిపోయింది.

పదిహేను రోజుల క్రితం అత్తమామల వేధింపులపై ఎమ్మెల్యే అంజు తమకు ఫిర్యాదు చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

శనివారం తల్లిదండ్రులు కూతురుకు ఫోన్ చేశారు. కానీ ఆమె ఫోన్ లిప్ట్ చేయలేదు. దాంతో వారిలో ఆందోళన మొదలైది. ఇంతలోనే ఆమె జీవితాన్ని ముగించుకున్నట్లు సమాచారం అందింది.

అత్తమామలు తమ కూతురిని చిత్రహింసలకు గురిచేశారని, అందుకే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.

తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ అంజూ సూసైడ్ నోట్ రాసింది. తనకు చాలా సమస్యలు ఉన్నాయని, అందుకే జీవితానికి ముగింపు పలుకుతున్నానని రాసింది.

Tags

Read MoreRead Less
Next Story