Crime: ఏం మాయ చేశాడో.. ఇద్దరు పిల్లల తల్లి ఇంజనీరింగ్ కుర్రాడితో జంప్

Crime: పెళ్లైన మగానుభావులే కాదు.. మహిళా మణులు కూడా పక్క చూపులు చూస్తున్నారు. పెడదోవ పడుతున్నారు. భర్త, ఇద్దరు పిల్లలున్న ఓ భార్యామణికి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోయే ఓ కుర్రాడు నచ్చేశాడు.. దాంతో కనిపెంచిన కన్నబిడ్డలను వదిలేసి అతడితో జంప్ అయింది.. ప్రేమ గుడ్డిది అంటారు అందుకేనేమో. ఆ మైకంలో పడితే ఏం చేస్తుంటారో వారికే తెలియదు.
చెన్నైకి చెందిన బీర్ మోహిద్దీన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. దూరపు బంధువు అయిన అబ్దుల్ ఖాదర్‌తో బీర్‌కి పెళ్లి సంబంధాలు చూడమని చెప్పారు అతడి తల్లిదండ్రులు. ఈ క్రమంలో బీర్.. ఖాదర్ ఇంటికి వచ్చిపోతుండేవాడు. ఖాదర్ కోడలు అయేషాతో బీర్‌కు చిన్నప్పటి నుంచి పరిచయం.. ఆ చనువుతోనే వాళ్లిద్దరూ ఎక్కువగా మాట్లాడుకునే వారు బీర్ ఇంటికి వచ్చిన ప్రతిసారి.
మాటల్లో ఒకరిపట్ల ఒకరికి ప్రేమ ఉన్న విషయం అర్థమైంది. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి కారవార్ చేరుకున్నారు. ఆరు నెలల నుండి అక్కడే కలిసి నివసిస్తున్నారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు అయేషా కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో కారవార్‌లో నివసిస్తున్న అయేషా వారి కంట పడింది. స్థానిక పోలీసుల సాయంతో బీర్‌ను, అయేషాను అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com