Visakhapatnam : వరకట్న వేధింపులు భరించలేక బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య..

Visakhapatnam : వరకట్న వేధింపులు భరించలేక బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య..
X
Visakhapatnam : విశాఖలో వరకట్న వేధింపులకు మరో ఆడకూతురు బలైంది

Visakhapatnam : విశాఖలో వరకట్న వేధింపులకు మరో ఆడకూతురు బలైంది. ఏడాది బిడ్డతో కలిసి వివాహిత పురుగుల మందుతాగింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తల్లీబిడ్డ మృతి చెందారు. మరో చిన్నారి చికిత్స పొందుతోంది. ఐదేళ్ల కిందట మోహనకృష్ణతో శైలజకు వివాహం జరిగింది. వివాహ సమయంలో.. కట్నకానుకలు ముట్టజెప్పారు. అయినా నిత్యం అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ వాట్సప్‌లో సూసైడ్‌నోట్‌రాసి సోదరికి పంపింది. ఇదివరకే రెండుసార్లు సూసైడ్‌కు యత్నించినట్లు శైలజ తల్లిదండ్రులు తెలిపారు. బాధితుల రోదనతో స్థానికులకు కంటనీరు తెప్పించింది.

Tags

Next Story