భారీ చోరీ: కిలోబంగారం, రూ.15 లక్షలతో నేపాలీ దంపతులు జంప్..

భారీ చోరీ: కిలోబంగారం, రూ.15 లక్షలతో నేపాలీ దంపతులు జంప్..
హైదరాబాద్‌ లోని గచ్చిబౌలిలో మరోసారి నేపాలీ పనిమనుషులు రెచ్చిపోయారు. యజమాని ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు.

హైదరాబాద్‌ లోని గచ్చిబౌలిలో మరోసారి నేపాలీ పనిమనుషులు రెచ్చిపోయారు. యజమాని ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. టెలికమ్ నగర్‌లో ఈ చోరీ జరిగింది. గోవింద్ పటేల్ అనే అతని ఇంట్లో.. నాలుగు నెలల క్రితం నేపాలీకి చెందిన పవిత్ర, లక్ష్మణ్ దంపతులు పని మనుషులుగా చేరారు. ఇంటి యజమాని శ్రీశైలం వెళ్లివచ్చేసరికి .. ఇల్లు, గుల్ల అయింది. కిటికి గ్రిల్‌ తొలగించి.. కిలో బంగారు ఆభరణాలు, 15 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పనిమనిషి కుటుంబం కనిపించక పోవడంతో గోవింద్ పటేల్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారీచోరీ

టెలికమ్ నగర్‌లో చోరీకి పాల్పడ్డ నేపాలీ దంపతులు

కిలోబంగారం, 15లక్షల నగదు ఎత్తుకెళ్లిన పనిమనిషి

గోవింద పటేల్ ఇంట్లో పనిమనుషులుగా చేరిన పవిత్ర,లక్ష్మణ్‌

శ్రీశైలం వెళ్లివచ్చేసరికి ఇల్లు గుల్ల చేసిన వైనం

కిటికీ గ్రిల్ తొలగించి, లాకర్ పగులగొట్టి చోరీ

వాచ్‌మెన్ కుటుంబం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు

కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్న పోలీసులు


Tags

Read MoreRead Less
Next Story