Uttar Pradesh: వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్య.. కానీ ఎవరితో అన్నదే సస్పెన్స్..

Uttar Pradesh: వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్య.. కానీ ఎవరితో అన్నదే సస్పెన్స్..
Uttar Pradesh: కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌లో దేవేంద్ర కుమార్ యాదవ్.. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లోని బిసౌలీ ప్రాంతంలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన బంధువుతో వీడియో కాల్ మాట్లాడుతూనే.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ మెడికల్ ఉద్యోగి. ఈ ఘటన ఒక్కసారిగా మెడికల్ స్టాఫ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.

బిసౌలీలోని కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌లో దేవేంద్ర కుమార్ యాదవ్.. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తాను తన బంధువుతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగా.. ఉన్నట్టుండి దేవేంద్ర సైడ్ నుండి ఎలాంటి స్పందన లభించలేదు. కంగారు పడిన బంధువు.. తన సహోద్యోగులకు ఫోన్ చేసి తెలిపారు. దీంతో వారు వచ్చి దేవేంద్ర తలుపు తట్టారు.

ఎంతసేపు తలుపు తట్టినా దేవేంద్ర తీయకపోగా.. వారంతా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా.. దేవేంద్ర ఉరివేసుకున్నాడు. అప్పటికే అతడు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అయితే బంధువుతో వీడియో కాల్ మాత్రం 40 నిమిషాలు నడిచినట్టు పోలీసులు గుర్తించారు. కానీ ఆ బంధువు వివరాలను ఇప్పుడే వెల్లడించమని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story