Medico : ఎక్మో సపోర్టుతో ప్రీతీకి చికిత్స, పోలీసుల అదుపులో నిందితుడు సైఫ్

మెడికో ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ప్రీతికి చికిత్స కొనసాగుతుంది. బాధితురాలిని వెంటిలేటర్‌పై ఉంచి ఎక్మో సపోర్టుతో చికిత్స అందిస్తున్నారు. మరో వైపు ప్రీతికి న్యాయం చేయడంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాలు నిమ్స్ ఆస్పత్రి ముందు ఆదోళన చేపట్టాయి. గిరిజన సంఘాల ఆందోళనతో ఆస్పత్రి ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆస్పత్రి ముందు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేఏంసీ కళాశాల విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైఫ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వరంగ్ సీపీ రంగనాథ్ తెలిపారు. సైఫ్‌పై ర్యాగింగ్ క్రింద కేసు నమోదు చేశామన్నారు. ఇక నిందితుడు ప్రీతిని సోషల్ మీడియా వేదికగా అవమాన పరిచాడని సీపీ తెలిపారు. సీనియర్లను జూనియర్లు సర్ అని పిలవాలని.. ఈ కారణంతో నిందితుడు ప్రీతికి బాస్‌లా వ్యవహరించినట్లు చెప్పారు.
డిసెంబర్ నుంచి ప్రీతిని నిందితుడు వేధిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. వేధింపులు ఎక్కవ కావడంతో ఈ నెల 20న బాధితురాలు తండ్రి నరేందర్ దృష్టికి విషయం తీసుకెళ్లిందన్నారు. దీంతో ప్రిన్సిపల్ వరకు ఈ వ్యవహారం చేరిందని.. ఇద్దరిని పిలిచి మాట్లాడినట్లు తెలిపారు. ఇక ప్రీతి ఏం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసిందో ఇప్పటికీ తెలియరాలేదన్నారు. అయితే మానసిక ఇబ్బందితోనే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సీపీ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com