పిచ్చాసుపత్రి నుంచి వచ్చి తాతను, అమ్మమ్మను చంపాడు

పిచ్చాసుపత్రి నుంచి వచ్చి తాతను, అమ్మమ్మను చంపాడు

తాతా అమ్మమ్మలను చంపేశాడు ఓ యువకుడు. ఈ ఘటన కేరళలో జరిగింది. అక్మల్ అనే యువకుడు కొంత కాలంగా మాసనిక సమస్యతో బాధపడుతున్నాడు. అతన్ని చికిత్స నిమిత్తం మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు బంధువులు. చికిత్స అనంతరం అతడు తన సొంత ఊరికి వెళ్లి తాత అమ్మమ్మలను చంపేశాడు. అతడి తల్లి రెండో పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో అతడు తన తాత అమ్మమ్మలతో కలిసి ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున వృద్ధులైన అబ్దుల్లా (75), జమీలా (64) ను హత్య చేసి పరారయ్యాడు. స్థానిక వ్యక్తి కిరాణా సామాన్లు ఇచ్చేందుకు వెళ్లగా... వద్ధులు చనిపోయి ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్మల్ కోసం గాలిస్తున్నారు. కర్ణాటకకు పారిపోయాడని తెలుసుకుని మంగుళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story