దారుణం.. ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్‌ ఆశ చూపించి మైనర్ బాలుడు అఘాయిత్యం

దారుణం.. ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్‌ ఆశ చూపించి మైనర్ బాలుడు అఘాయిత్యం
బాధ భరించలేక చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో భయపడ్డ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు.

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గరిడేపల్లి మండలం, రేగులగడ్డ తండాలో.. ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్‌ ఆశ చూపించి.. 14 ఏళ్ల మైనర్ బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధ భరించలేక చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో భయపడ్డ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు.

అరుపులు విని అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు వెంటనే బాలికను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తరువాత వైద్యుల సలహాలతో హుజూర్‌ నగర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ యువకుడు కూడా బాలుడే కావడంతో ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story