Hyderabad Gangrape : హైదరాబాద్‌లో మరో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్..

Hyderabad Gangrape : హైదరాబాద్‌లో సంచలనం రేపిన మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నాంపల్లిలోని హోటల్ వద్ద సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ దృశ్యాలతో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అంతేకాదు.. అసలేం జరిగిందో సృజన స్టే ఇన్ హోటల్ నిర్వాహకుడు రాహుల్ తెలిపారు. ఈనెల 13 రాత్రి సోహైల్ అనే వ్యక్తి హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడని చెప్పారు.
సోహైల్‌తో పాటు ఓ అమ్మాయి ఇద్దరు చెక్ ఇన్ అయ్యారన్నారు. చెక్ అయిన గంట తర్వాత సోహైల్ మరో స్నేహితుడు రూమ్‌లోకి వెళ్లారని తెలిపారు. ఇద్దరి ఐడీ ప్రూఫ్‌లు తీసుకున్న తర్వాతే రూమ్ ఇచ్చామన్న హోటల్ నిర్వాహకులు రాహుల్.. ఐటీ ప్రూఫ్ ఇచ్చే సమయంలో అమ్మాయి అభ్యంతరం చెప్పలేదన్నారు. అమ్మాయి ఇష్టపూర్వకంగానే హోటల్‌కు వచ్చినట్లు అనిపించిందని తెలిపారు. అబిడ్స్ పోలీసులు వచ్చి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తీసుకెళ్లారని రాహుల్ చెప్పారు.
అటు ఈనెల 14న సాయంత్రం నాంపల్లి హోటల్ నుండి బాధితురాలు, నిందితులు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రవిష్ మెహది నిన్న సాయంత్రం హోటల్ నుండి బైక్‌పై బాధితురాలిని తీసుకెళ్తున్న దృశ్యాలతో పాటు రిసెప్షన్‌లోని హోటల్ సిబ్బందితో మాట్లాడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తీసుకెళ్లిన అబిడ్స్ పోలీసులు.. హోటల్ లోపల, బయట రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెయిన్‌బజార్‌కు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com