క్రైమ్

Hyderabad: మైనర్‌ బాలిక కిడ్నాప్‌.. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటనలో పోలీసుల మౌనం..

Hyderabad: హైదరాబాద్‌లో ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేశారు. బాలికపై లైంగిక దాడి జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Hyderabad: మైనర్‌ బాలిక కిడ్నాప్‌.. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటనలో పోలీసుల మౌనం..
X

Hyderabad: హైదరాబాద్‌లో ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేశారు. బాలికపై లైంగిక దాడి జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడంపైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. హైదరాబాద్‌ మొఘల్‌పురాకు చెందిన బాలికను ఓ క్యాబ్‌ డ్రైవర్ తీసుకెళ్లాడు. బాలికను ఓ రాత్రంతా వేరే చోట ఉంచి తిరిగి ఇంటి దగ్గర విడిచిపెట్టాడు. అయితే, అప్పటికే బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్యాబ్‌ డ్రైవర్‌ బాలికను తీసుకురావడంతో.. ఆమె నుంచి వివరాలు సేకరించి.. డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌కు తీసుకెళ్లి, అక్కడ తెలిసిన వ్యక్తుల ఇంట్లో ఉంచానని చెప్పాడు. దీంతో బాలికకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కొందుర్గ్‌లో ఆ రాత్రి ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES