Hyderabad: పబ్ నుండి బాలిక కిడ్నాప్.. ఆపై లైంగిక దాడికి యత్నం.. ఒకరు అరెస్ట్..

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ నుంచి బాలికను కిడ్నాప్ చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. బాలికను కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 28న మైనర్ బాలిక.. తన స్నేహితులైన సూరజ్, హాడీల ఆహ్వానం మేరకు.. జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్‌కు వెళ్లింది. పార్టీ ముగించుకుని.. అదే రోజు సాయంత్రం పబ్ నుంచి ఆమెను.. రెడ్ కలర్ మెర్సిడిజ్ కారులో బయటికి తీసుకెళ్లారు స్నేహితులు.
బాలిక పట్ల అసభ్యంగా ప్రవరించినట్లు తెలుస్తోంది. ఆమె మెడపై గాయాలయ్యాయి. నిందితుల నుండి తప్పించుకున్న బాధితురాలు ఇంటికి చేరుకుని జరిగిన ఘటన గురించి చెప్పడంతో ఆమె తండ్రి.. జూబ్లీహిలిస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమార్తెతో ఇద్దరు యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో.. పాటు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో.. సీసీటీవీ పుజేటీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు.
BMW కారులో బాలికను తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీలో ఈ కిడ్నాప్ దృశ్యాలను గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేశారు. ఐపీసీ సెక్షన్ 354, 323, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ కోసం మైనర్లను లోనికి ప్రవేశించడానికి పబ్ యాజమాన్యం ఎలా అనుమతించిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com