10వ తరగతి బాలికకు లైగింక వేధింపులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు

10వ తరగతి బాలికకు లైగింక వేధింపులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు
తెలిసీ తెలియని వయసులో ప్రేమలు, పెళ్లిళ్లు.. యువత జీవితాన్ని నాశనం చేస్తున్నాయి.

తెలిసీ తెలియని వయసులో ప్రేమలు, పెళ్లిళ్లు.. యువత జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. కరీంనగర్ కు చెందిన ఓ మైనర్ బాలిక 10వ తరగతి చదువుతోంది. ఆమె అదే ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రేమిస్తోంది. మీ ప్రేమ వ్యవహారం మీ ఇంట్లో వాళ్లకు చెబుతామని బెదిరించి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 10వ తరగతి చదువుతున్న బాలిక తన ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని ప్రేమిస్తోంది. ఒక సంవత్సరం క్రితం, అబ్బాయికి చెందిన ఇద్దరు స్నేహితులు వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు.

ఆమె ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించి ఇద్దరూ తమ లైంగిక కోరికలు తీర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మరో ముగ్గురు అబ్బాయిలు కూడా అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించారు.

వేధింపులు తట్టుకోలేక బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె ప్రియుడితో సహా ఆరుగురిపై పోక్సో చట్టం, అత్యాచారం, వేధింపుల సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారు. ఆరుగురిలో ఐదుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు కాగా, ఆరో వ్యక్తి పాలిటెక్నిక్ విద్యార్థి.

Tags

Read MoreRead Less
Next Story