శ్రద్ధా వాకర్ ఘటన చూసే స్కెచ్... ముంబై హత్య నిందితుడు

శ్రద్ధా వాకర్ ఘటన చూసే స్కెచ్... ముంబై హత్య నిందితుడు
X
సరస్వతి అతని షాప్ కు తరచూ రావడం ద్వారా వారిద్దరికీ పరిచయమై 2016 నుంచి వారు ఒకే ఇంట్లో ఉంటున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య తరహాలో మహారాష్ట్రలో వెలుగు చూసిన సంఘటన ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. థానేలో 56 ఏళ్ల మనోజ్ సానే అని వ్యక్తి అతనితో సహజీవనం చేస్తున్న సరస్వతి వైద్య అనే యువతిని చంపి ముక్కలు చేసి, వాసన రాకుండా కుక్కర్లో ఉడకబెట్టిన సంఘటన తెలిసిందే. అయితే తాను ఎటువంటి హత్య చేయలేదని ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని నిందితుడు మనోజ్ అనే పోలీసుల విచారణలో చెప్పినట్టుగా సమాచారం. మృతురాలు తన సహజీవన భాగస్వామి కాదని, కుమార్తె వంటిదని పోలీసులకు చెప్పిన నిందితుడు, మృతదేహం తన ఇంట్లో దొరికితే కేసులో ఇరుక్కుంటాను అన్న భయంతో దానిని మాయం చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలిపాడు. అయితే శ్రద్ధ వాకర్ ఘటన చూసే తనకి ఈ ఆలోచన వచ్చినట్టు నిందితుడు అంగీకరించాడని పలు జాతీయ మీడియా సంస్థలు సైతం తమ కథనాల్లో వెల్లడించాయి.

ఈ ఘటనలో బాధితురాలు సరస్వతి వైద్య, అహమ్మద్ నగర్ లోని ఒక బాలికల ఆశ్రమంలో పెరిగింది. రెండు సంవత్సరాల క్రితం ఆమెను చివరిసారిగా చూసామని చెప్తున్నా అనాధాశ్రమం నిర్వాహకులు ఆమె ఒక అంకుల్ తో కలిసి ఉంటున్నట్టుగా చెప్పిందన్నారు. ఇక 56 సంవత్సరాల వయతున్న మనోజ్ సానే కుటుంబానికి దూరంగా ఉంటూ ఒక కిరాణా షాప్లో పని చేసేవాడని, సరస్వతి ఆ షాప్ కు తరచూ రావడం ద్వారా వారిద్దరికీ పరిచయమై 2016 నుంచి వారు ఒకే ఇంట్లో ఉంటున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గత కొద్దిరోజులుగా వీరి ప్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి తమ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

అయితే తాజా విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు పోలీసు సైతం షాక్ అయ్యేలా చేశాయి. తాను ఒక హెచ్ఐవి బాధితుడినని చాలా ఏళ్ళ క్రితమే ఈ వ్యాధి బారిన పడినట్టు చెప్పాడు నిందితుడు. అలాగే సరస్వతి తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె తనకు కూతురు లాంటిదని, సరస్వతి పదవ తరగతి పరీక్షల కోసం గణితం నేర్చుకునే క్రమంలోనే తమ మధ్య స్నేహం ఏర్పడింది అన్నాడు. అయితే తాను కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చినా సరస్వతి ఎంతో అనుమానించేదని చెప్పాడు. అలాగే జూన్ మూడవ తేదీన తను ఇంటికి వచ్చేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉందని, కేసులో ఇరుక్కుంటానేమో నన్ను భయంతోనే ఇలా చేశానని వెల్లడించాడు.

ఇదిలా ఉండగా నిందితుడి ఇంటిలో దొరికిన బాధితురాలి శరీర భాగాలను పోరెన్సీ కి ల్యాబ్ కి పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా నిందితుడు చెబుతుండటంతో కట్ చేసి ఉడికించిన శరీర భాగాలలో విషం ఆనవాళ్లు ఉన్నాయో, లేదో తెలుసుకోవాల్సి ఉంది. నిందితుడిని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు జూన్ 16 వరకు పోలీసులు కస్టడీకి అనుమతించింది.

Tags

Next Story