క్యాబ్ లో రాజకీయ చర్చలు.. ప్రయాణీకుడిని హత్య చేసిన డ్రైవర్

క్యాబ్ లో రాజకీయ చర్చలు.. ప్రయాణీకుడిని హత్య చేసిన డ్రైవర్
ఎన్నికల వేళ.. ఏ ఇద్దరు కలిసినా పాలిటిక్స్ గురించే మాటలు.

ఎన్నికల వేళ.. ఏ ఇద్దరు కలిసినా పాలిటిక్స్ గురించే మాటలు.. ఆ ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైతే ఓకే.. కానీ వేరు వేరు పార్టీలైతేనే ఇబ్బంది. ఇక్కడ అదే జరిగింది. చర్చల సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రయాణీకుడు విమర్శించాడు.. దాంతో క్యాబ్ డ్రైవర్ కు ఒళ్లు మండింది.. అతడి మాటలు వినీ వినీ సహనం కోల్పోయాడు.. ఆ వ్యక్తిని క్యాబ్ డ్రైవర్ హత్య చేశాడు.

నిందితుడిని అమ్జాద్‌గా గుర్తించారు. మృతుడు రాజేష్ దూబే (59) మిర్జాపూర్‌లో జరిగిన తన సోదరుడు రాకేష్ దూబే కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు వెళుతున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శించడం మొదలు పెట్టాడు. దాంతో అది నచ్చని డ్రైవర్‌ ఆ వ్యక్తిని చితకబాది హత్య చేశాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లాలో జరిగింది. నేరం చేసి పారిపోయిన నిందితుడు అంజాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కారులో ఉన్నవారి మధ్య రాజకీయాలపై కొన్ని వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. నాయకులపై విమర్శలు గుప్పించడంతో డ్రైవర్‌ వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కొంత సమయం తరువాత, ఇతర ప్రయాణీకులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. రాజేష్ దూబే మాత్రమే కారులో ఉన్నారు.

కొంత సేపటికి రాజేష్ కూడా కారు దిగాడు. అనంతరం రాజేష్ కాలినడకన తన ఇంటి వైపు వెళుతుండగా అమ్జాద్ వేగంగా వస్తున్న బొలెరో కారును వెనుక నుంచి ఢీకొట్టాడు. అది రాజేష్ కు తాకడంతో ముందుకు పడిపోయాడు. అమ్జాద్ రాజేష్‌ను మరో 200 మీటర్లు ఈడ్చుకెళ్లి, అతడిపై కారు ఎక్కించి పారిపోయాడు. దీంతో దూబే అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story