Dammaiguda : అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి.. చెరువులో విగతజీవిగా

Dammaiguda: దమ్మాయిగూడలో విషాదం నెలకొంది.. నిన్న దమ్మాయిగూడలో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి ఇందు దమ్మాయిగూడ చెరువులో విగత జీవిగా కనిపించింది. బాలిక మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా డాగ్ స్క్వాడ్‌తో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు చెరువులో పాప మృత దేహం లభ్యమైంది..బాలిక మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు..
నిన్న స్కూల్ దగ్గర చిన్నారిని వదిలి వెళ్లాడు ఆమె తండ్రి.. ఆ తరువాత 9.30 కి పాప కనిపించట్లేదని తల్లిదండ్రులకు టీచర్ ఫోన్ చేశారు..దీంతో స్కూల్ దగ్గరకు చేరుకున్న పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన జవహర్ నగర్ పోలీసులు సీసీటీవి ఫుటేజ్‌ను పరిశీలించారు..
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పాప మృతదేహం దమ్మాయిగూడ చెరువులో కనిపించింది. పిల్లలకు రక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com