CRIME: మోడల్ ఫోటో పెట్టి.. రూ. 3 కోట్లు కొట్టేశారు

CRIME: మోడల్ ఫోటో పెట్టి.. రూ. 3 కోట్లు కొట్టేశారు
X

పెళ్లి చేసుకోవడానికి మంచి అమ్మాయి కోసం మ్యాట్రీమోనీని ఆశ్రయించిన తెలుగు ఎన్‌ఆర్‌ఐని.. ఓ అన్నాచెల్లెళ్లు నిండా ముంచేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ యువకుడు అమెరికాలోని నార్త్‌ కరోలినాలో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2023లో ఆయనకు మ్యాట్రీమోనీలో మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన బర్కా జైస్వానీ అనే పేరుతో ఓ అమ్మాయి పరిచయమైంది. పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐని నమ్మించిన ఆమె... ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, విదేశీయానం కల అని చెప్పి ఏకంగా రూ.2.68 కోట్లు లాగేసింది. ఇటీవల ఆ యువకుడు బర్కాకు వీడియో కాల్‌ చేశాడు. అందులో మాట్లాడిన అమ్మాయి.. మ్యాట్రిమోనీలోని ప్రొఫైల్‌లో ఉన్న యువతిలా లేకపోవడంతో డబ్బుల విషయం అడిగాడు. ఆ యువకుడు అమెరికా నుంచి ఇందౌర్‌కు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.బర్కా అసలు పేరు సిమ్రన్‌ అని, ఆమెకు అప్పటికే పెళ్లయిందని తెలిసింది. మ్యాట్రీమోనీలో ఓ మోడల్‌ ఫొటో పెట్టి తన సోదరుడు విశాల్‌తో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

మ్యాటిమోనీలో..

మ్యాట్రిమోనీలోని ప్రొఫైల్‌లో ఉన్న యువతి వేరువేరుగా అనిపించడంతో.. అనుమానం కలిగింది. నగదు తిరిగి ఇవ్వాలని కోరగా.. ఆ యువతి స్పష్టమైన సమాధానాలు చెప్పలేదు. దీంతో ఆ యువకుడు అమెరికా నుంచి ఇండోర్‌కు వచ్చి పోలీసులకు తన సమస్యను వివరించాడు. దర్యాప్తు చేపట్టగా క్రైమ్ వివరాలు వెల్లడయ్యాయి. ఆ మహిళ పేరు సిమ్రన్‌ అని, ఆమెకు అప్పటికే వివాహం అయినట్లు విచారణలో వెల్లడైంది. మ్యాట్రీమోనీలో ఓ మోడల్‌ ఫొటో పెట్టి తన సోదరుడు విశాల్‌తో కలిసి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story