Umesh Khatik: మోస్ట్‌ వాంటెడ్ చైన్ స్నాచర్.. చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు..

Umesh Khatik: మోస్ట్‌ వాంటెడ్ చైన్ స్నాచర్.. చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు..
Umesh Khatik: హైదరాబాద్‌లో ఒకే రోజు ఐదు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డ ఉమేష్‌ ఖతిక్‌ పోలీసుల నుంచి పరారయ్యాడు.

Umesh Khatik: హైదరాబాద్‌లో ఒకే రోజు ఐదు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డ ఉమేష్‌ ఖతిక్‌ పోలీసుల నుంచి పరారయ్యాడు. హైదరాబాద్‌లో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడ్డ ఉమేష్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఉమేష్‌ను పీటీ వారెంట్‌పై అప్పగించమని హైదరాబాద్‌ పోలీసులు కోరారు. అయితే, ఉమేష్‌ను అప్పగించడానికి అహ్మదాబాద్ పోలీసులు అంగీకరించలేదు.

అతడిని తామే విచారిస్తామని చెప్పి కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు అహ్మదాబాద్ పోలీసులు. తీరా చూస్తే.. చైన్‌ స్నాచర్ ఉమేష్ ఖతిక్‌.. అహ్మదాబాద్‌ పోలీసుల నుంచి కూడా తప్పించుకున్నాడు. ఉమేష్ పరారీపై తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమేష్‌ను అదుపులోకి తీసుకోడానికి హైదరాబాద్‌ పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు పీటీ వారెంట్‌తో అహ్మదాబాద్‌ వెళ్లడంతో అసలు విషయం బయటపడింది.

సీరియల్ స్నాచర్‌ను అంత తేలిగ్గా ఎలా తీసుకున్నారనేది హైదరాబాద్ పోలీసుల అనుమానం. ఎందుకంటే, ఉమేష్‌ ఖతిక్‌కు గతంలోనూ పోలీసుల నుంచి తప్పించుకున్న రికార్డ్‌ ఉంది. పైగా మైనర్‌గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ దొంగతనాల్లో ఆరితేరిపోయి ఉన్నారు. అలాంటి దొంగను అంత తేలిగ్గా ఎలా వదిలేశారనేదే ప్రశ్న. ప్రస్తుతం అహ్మదాబాద్‌ పోలీసుల తో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు మళ్లీ సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.

హైదరాబాద్‌లో ఒకే రోజు ఐదు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడిన ఉమేష్‌ ఖతిక్‌ను 24 గంటల్లోనే గుర్తించారు హైదరాబాద్‌ పోలీసులు. అతడు అహ్మదాబాద్‌లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు.. రికవరీల్లో ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఇక్కడి సమాచారం మొత్తం ఇచ్చారు. దీన్నే అక్కడి పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే, హైదరాబాద్‌లో ఐదు చోట్ల నుంచి మొత్తం 18.5 తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లాడు ఉమేష్‌.కాని, అహ్మదాబాద్‌ పోలీసులు ఆ బంగారాన్ని తమ కేసుల ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తోంది. పైగా ఉమేష్‌ స్టేట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు. హైదరాబాద్‌లో నేరాలు చేశాడని రిపోర్టులో రాస్తూనే.. దొంగతనం చేస్తుండగా గొలుసు పడిపోయినట్టు రికార్డ్ చేశారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story