Most Wanted Criminal : క్రైం లిస్ట్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..
Most Wanted Criminal : అతను వృత్తి రిత్యా ఓ క్లాస్-1 కాంట్రాక్టర్. అయితే ప్రవృత్తి మాత్రం చోరకళ. అతడి నేరాల చిట్టా చూసిన పోలీసులే కంగుతిన్నారు. గత 24ఏళ్లలో దేశవ్యాప్తంగా ఐదు వేలకు పైగా కార్లను చోరీ చేశాడు. అంతే కాదు కార్లను చోరీ క్రమంలో హత్యలు కూడా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘరానా దొంగ మీద ఇప్పటికే దాదాపు 180 కేసులు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వరుస చోరీలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న అనిల్ చౌహాన్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌కు ఢిల్లీ,ముంబయిలపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీగా ఆస్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశంలోనే అతి పెద్ద దొంగల ముఠా అనిల్ చౌహాన్ గ్యాంగ్ గుట్టురట్టయింది. ఈ ముఠాకు చీఫ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. క్ష
అస్సాంకు చెందిన అనిల్ చౌహాన్ ప్రస్తుతం కాన్పుర్‌లో నివాసముంటున్నాడు. 1998లో చిన్న వాహనాల చోరీలు మొదలుపెట్టాడు. ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఐదువేలకు పైగా చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఖఢ్గమృగాల కొమ్ముల అక్రమ రవాణా, ఆయుధాల సరఫరాతోపాటు పలు హత్యల్లోనూ అనిల్ హస్తం ఉంది.
పలు రాష్ట్రాల్లో 181 కేసుల్లో నిందితుడిగా ఉన్న చౌహాన్ పలుసార్లు జైలుకి వెళ్లి వచ్చాడు. అస్సాం ప్రభుత్వంలో క్లాస్-1 కాంట్రాక్టర్‌గా ఉన్న అతడిపై ఈడి గతంలో దాడులు చేసింది.సీజ్ చేసిన అస్తులను వేలం వేసింది. అయితే బుద్ధి మారని అనిల్ ఢిల్లీకి మకాం మార్చి మళ్లీ చోరీలు చేయడం మొదలుపెట్టాడు.
అయితే, సెంట్రల్ ఢిల్లీలో ఇటీవల ఆయుధాల అక్రమ రవాణా పెరిగిన నేపథ్యంలో పోలీసులుస్పెషల్ చెక్‌పోస్టులు పెట్టారు. ఇందులో భాగంగా నాకాబందీ నిర్వహిస్తోన్న స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందానికి లోకల్ మేడ్ గన్‌తో పాటు చోరీ చేసిన ఓ బైక్‌తో ఉన్న అనిల్ చౌహాన్ చిక్కాడు. అనుమానంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు మరో ఐదు తుపాకులు, చోరీ చేసిన కార్లు దొరికాయి.
అనిల్ క్రైమ్ హిస్టరీ ట్రేస్ చేస్తే 180 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా ఢిల్లీ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఐదేళ్ల జైలుశిక్ష కూడా పడినట్లు ఢిల్లీ సెంట్రల్ జోన్ పోలీసులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com